సైబర్‌ నేరాలకు టెకీలతో చెక్‌ | Sakshi
Sakshi News home page

సైబర్‌ నేరాలకు టెకీలతో చెక్‌

Published Thu, Jan 18 2018 1:21 PM

To fight e-crime, govt to hire experts from IITs, pvt institutes  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఆన్‌లైన్‌ మోసాలు, హ్యాకింగ్‌, ట్రాఫికింగ్‌, చైల్డ్‌ పోర్నోగ్రఫీ వంటి సైబర్‌ నేరాలకు చెక్‌ పెట్టేందుకు ప్రముఖ ప్రభుత్వ, ప్రయివేటు సంస్థల నుంచి ఐటీ నిపుణులను నియమించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. సైబర్‌ నేరాలను నియంత్రించేందుకు ఐఐటీలు, ప్రైవేటు సంస్థల నుంచి నిపుణులను నియమించుకునేందుకు రంగం సిద్ధమైంది. ఇండియన్‌ సైబర్‌ క్రైమ్‌ కోఆర్డినేషన్‌ సెంటర్‌ కోసం రోడ్‌మ్యాప్‌ను ఖరారు చేసేందుకు వీరి సేవలను వినియోగించుకోవాలని యోచిస్తోంది.

ఐటీ సెక్యూరిటీ నిపుణులు, ఎథికల్‌ హ్యాకర్లు, వెబ్‌ అనలిస్టులు, కంప్యూటర్‌ ప్రోగ్రామర్ల సేవలను వాడుకుంటూ సైబర్‌-ఫోరెన్సిక్‌ యూనిట్లను ఏర్పాటు చేయాలని సన్నాహాలు చేస్తోంది. హోంమంత్రిత్వ శాఖ ఆలోచనల్లోంచి పుట్టిన ఈ కార్యకలాపాల కోసం ఐటీ నిపుణుల నుంచి కీలక సూచనలు, అభిప్రాయం కోరాలని యోచిస్తోంది. మరోవైపు సైబర్‌ క్రైమ్‌లను ఎదుర్కొనే విధాన ప్రకియను వేగవంతం చేయాలని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అధికారులకు సూచించారు. హోమంత్రిత్వ శాఖ పరిధిలో కొత్తగా ఏర్పాటైన సైబర్‌ ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ డివిజన్‌లో నాలుగు యూనిట్ల ఏర్పాటుకు మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement